CBT-2: ఆర్ఆర్‌బీ జేఈ సీబీటీ-2 పరీక్ష తేదీలు ఖరారు! 6 d ago

రైల్వే శాఖ జూనియర్ ఇంజినీర్, కెమికల్ సూపర్‌వైజర్, డిపో మెటీరియల్ సూపరింటెండెంట్, కెమికల్ అండ్ మెటలర్జికల్ అసిస్టెంట్ సీబీటీ-2 పరీక్షల తేదీలను వెల్లడించింది. ఈ పరీక్షను ఏప్రిల్ 22న నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఇటీవలే సీబీటీ-1 ఫలితాలను విడుదల చేయగా సీబీటీ-2 పరీక్షకు షార్ట్‌లిస్ట్ అయిన 20,792 మంది అభ్యర్ధుల రోల్ నంబర్‌తో ఉన్న వివరాలను ఆర్ఆర్‌బీ అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపరిచింది. రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (ఆర్ఆర్‌బీ) దేశ వ్యాప్తంగా అన్ని రీజియన్లలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ (సీఈఎల్ నంబర్ 03/2024) విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ నోటిఫికేషన్‌ద్వారా 7,951 జూనియర్ ఇంజినీర్, కెమికల్ సూపర్‌వైజర్ తదితర ఖాళీలు భర్తీ కానున్నాయి. పూర్తివివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.